ems logo
Home  

Announcements

చందారులకు ముఖ్య గమనిక!
ప్రియమైన ‘ఇఎంఎస్’ చందాదారులారా... గత నెల వినియోగచార్జీలు చెల్లించడానికి గడువు ముగిసిన విషయం మీకు తెలిసిందే. దయచేసి మీ చార్జీలు చెల్లించి కనెక్షన్ నిరంతరం యాక్టివేట్లో ఉండేలా చూస్తారని మనవి.
ఎడిటర్
9985544679
ఉచిత వెబ్ సైట్ కోసం వివరాల సేకరణ
‘ఇఎంఎస్’ చందాదారులకు ఉచితంగా వెబ్ సైట్ రూపొందించాలన్న ఆలోచన నేపథ్యంలో సభ్యుల నుంచి వచ్చిన స్పందన పదాల్లో చెప్పలేనిది. భవిష్యత్ అవసరాల ద్రుష్ట్యా అన్ని పత్రికలకు సొంతంగా వెబ్ సైట్ ఉండాలన్న ‘ఇఎంఎస్’ ఆశయం ఇప్పటికే అమలులోకి వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. విజయదశమి సందర్భంగా ఈ కొత్త కార్యక్రమానికి ‘ఇఎంఎస్’ శ్రీకారం చుట్టిందని వెల్లడిస్తూ ఇప్పటికే చందాదారులైన ప్రచురణకర్తలు వెంటనే తమ పేర్లను వెబ్ సైట్ కోసం నమోదు చేయించుకోవాలని సూచించడమైనది. మొదట ప్రకటించినట్లే ఈ సేవలు ‘ఇఎంఎస్’ చందాదారులకు పూర్తి ఉచితం. దాదాపు 30 వేల రూపాయల విలువైన, అన్ని రకాల ఆధునిక సాంకేతిక విలువలతో కూడిన వెబ్ సైటును అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రచురణకర్తలకు అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ఈ ప్రయత్నానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన లభించిన నేపథ్యంలో సభ్య, చందాదారుల కోసం మరిన్ని సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యామని మనవి చేస్తూ... ‘ఇఎంఎస్’ గురించి, వెబ్ సైట్ సేవల గురించి మరింత తెలుసుకునేందుకు మరికొంత సమాచారం...

తెలుగు పత్రికా రంగంలో 'ఎపిఇఎంఎస్‌' సాధించిన విజయాలు... రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పత్రికలకు అందిస్తున్న చేయూత గురించి మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పత్రికల అవసరాల్లో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా 'ఇఎంఎస్‌' తన యంత్రాంగాన్ని, సాంకేతిక వ్యవస్థనీ ఆధునికీకరించుకోవడంతో పాటు అవసరార్ధం విస్తరించుకుంటూ నాణ్యమైన సేవలు అందించేందుకు కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సంస్థాగతంగా కూడా అనేక మార్పులు చేసి వెబ్‌ ఆధారిత సేవలను విస్తరించింది. గతంలో చేపట్టిన ఆధునికీకరణ, అభివృద్ధి ప్రయత్నాల కారణంగా కొంత వరకు చందాదారులకు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి. నిర్ణీత సమయానికి వెబ్‌లో వార్తలు, ఫొటోలు అప్‌లోడ్‌ చేసినప్పటికీ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల ఫలితంగా వాటిని చందాదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారన్నది వాస్తవం. అయినప్పటికీ వాటి గురించి పెద్ద మనసుతో అర్ధం చేసుకుని 'ఇఎంఎస్‌'తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్న ప్రచురణకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆయా సమస్యలన్నిటినీ అధిగమించి సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

చిన్న, మధ్యతరహా పత్రికలకు మరింత చేయూత... ప్రచారం కల్పించే క్రమంలో భాగంగానే 'ఇఎంఎస్‌' ఓ సరికొత్త సాంకేతిక సహకార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు సభ్య, చందారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్టే... వెబ్‌ ఆధారిత సేవలను కూడా చిన్న పత్రికలకు విస్తరించాలని 'ఇఎంఎస్‌' నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ కేవలం పెద్ద పత్రికలకు మాత్రమే పరిమితమైన సొంత వెబ్‌సైట్‌, ఇ-పేపర్‌, ఆన్‌లైన్‌లో తాజా వార్తలు వంటి సేవలు ఇప్పుడు చిన్న, మధ్యతరహా పత్రికలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాలంలో మీకొక ఆస్థానం!
అచ్చ తెలుగులో అంతర్జాలంగా పిలవబడుతున్న ఇంటర్నెట్‌లో మీకొక చిరునామా ఏర్పాటుచేసి మీ పత్రికకు ప్రచారంతో పాటు పెద్ద పత్రికలకు సమానంగా గుర్తింపు తీసుకురావాలన్న సంక్పలంలో భాగంగా 'ఇఎంఎస్‌' 'మీ పేపర్‌... ఇ-పేపర్‌' కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 'ఇఎంఎస్‌' చందాదారుల పత్రికలకు ఆన్‌లైన్‌ ఎడిషన్ల సదుపాయాన్ని అందుబాటులో ఉంచడం, వారి వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఉంచడం, రోజువారీ ప్రింట్‌ ఎడిషన్‌ను ఇ-పేపర్‌గా మార్పుచేసి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచి బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం వంటి ఆధునిక సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సదుపాయాన్ని కలిగి ఉన్న పత్రికలకు వెబ్‌ సపోర్టింగ్‌ తెలుగు ఫాంట్లతో అవసరమైన పూర్తి స్థాయి వార్తలను సరఫరా చేయడం, కొత్తగా చేరే వారికి పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందించడం జరుగుతుంది.
'ఈ సేవ'ల కోసం 'ఇఎంఎస్‌' చందాదారులు అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద పత్రికల, ఇతర కమర్షియల్‌ వెబ్‌ సైట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా లే అవుట్‌ డిజైనింగ్‌ చేసి రోజు వారీ తాజా వార్తలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసి పత్రికా ప్రపంచంలో మీ ఉనికిని కాపాడడానికి కృషిచేయడం మా లక్ష్యం. వేలకు వేలు డబ్బులు పెట్టి తయారుచేయించిన సైట్‌ల కంటే ఉచితంగా అందిస్తున్న 'ఇఎంఎస్‌' వెబ్‌ పేజీలు ఎంతో నాణ్యతతో కూడి చూడ ముచ్చటగా చదువరులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు.

మారుతున్న పరిస్థితులు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఇంటర్నెట్‌ జనబాహూళ్యయంలో ఒక వనరుగా మారిందనడంలో అతిశయోక్తిలేదు. తక్కువ సమయంలో క్షణాల్లో వేలమైళ్ల దూరానికి సైతం సమాచారం పంపుకోవడం సాధ్యం అవుతోంది. ఈ కోణంలో అంతర్జాలంలో మనకూ ఓ చిరునామా ఉండడం తప్పనిసరైంది. ప్రతి పత్రికకూ ఇ-మెయిల్‌ అడ్రస్‌ ఎలా తప్పనిసరి అయిందో ఇప్పుడు ఇంటర్నెట్‌ ఎడిషన్‌ కూడా అలాంటిదే కాబోతోంది. దక్షిణ భారత దేశంలో ఇప్పటికే చాలా వరకు చిన్న పత్రికలు పెద్ద పత్రికలతో పోటీపడి వెబ్‌ సైట్‌లను నిర్వహిస్తూ ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ప్రకటనల ద్వారానే చాలా వెబ్‌ సైట్లు నెలకు కనీసం 15 వేల నుంచి 50 వేల రూపాయలు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నెట్‌ ద్వారా ప్రకటనలు జారీచేయడానికి చాలా ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది 'గూగుల్‌' డాట్‌ కాం సంస్థ అని మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని ఇతర భాషా పత్రికలతో పోల్చిచూస్తే ఆన్‌లైన్‌ ద్వారా ప్రచారం, ఆదాయం పొందడంలో (పెద్ద పత్రికలు మినహా) మనం ఇంకా ప్రారంభ దశకు కూడా నోచుకోలేదనే చెప్పుకోవాలి. 'ఇఎంఎస్‌' తాజా ప్రయత్నం ఆ లోటును దాదాపు తీర్చనుందని భావిస్తూ... ఈ సేవల వల్ల మీరు కూడా ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తోంది. అందుకే మీరు కూడా ముందడుగు వేసి మీకు తగిన రీతిలో సైట్‌ రూపొందించుకుని నెట్‌లో ఉనికి కాపాడుకోవాల్సి ఉంది.

ఇవాళ రేపు పరిస్థితి ఎలా తయారైందంటే... కాగితం రూపంలో కనిపించే పత్రికల కంటే నెట్‌లో కనిపించే పత్రికలదే లాభసాటి వ్యాపారం. ఎందుకంటే దీనిపై పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకపోవడం... ప్రచురించే పత్రికలతో సమానంగా (కొన్ని సందర్భాలలో అంత కంటే ఎక్కువగా) ప్రకటనలు నెట్‌ ఎడిషన్లకూ వస్తుండడం రోజురోజుకీ వెబ్‌ ఆధారిత సేవలు విస్తరిస్తుండడానికి కారణమని భావించాలి. అందుకే మేం కూడా మీ కోసం ఆ ఆధునిక సేవలను పూర్తి ఉచితంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మా సంస్థ కమర్షియల్‌ వెబ్‌సైట్‌లకు యునీకోడ్‌ సపోర్ట్‌తో కూడిన తెలుగు వార్తలను అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి అవకాశాలు అందరికీ, అన్ని సమయాల్లో రావు. సాధారణంగా మనం ఒక తెలుగు వెబ్‌సైట్‌ మన పత్రిక అవసరాలకు తగిన రీతిలో తయారుచేయించాలంటే ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం కనిష్ఠంగా 5 వేల నుంచి గరిష్ఠంగా 30 వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. అది కూడా కేవలం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ (డొమైన్‌ బుకింగ్‌), అప్పటి అవసరానికి అనుగుణంగా అయిదు నుంచి పది పేజీల డిజైనింగ్‌ పనులు చేసి ఇవ్వడం వరకే ఆ చార్జీలు. మిగిలిన పనంతా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రోజూ వార్తలు అప్‌లోడ్‌ చేసుకోవడం, అవసరమైన ఫొటోలను ఇన్‌సర్ట్‌ చేయడం, వీలును బట్టి పేజీలలో డిజైన్‌ పరంగా మార్పులు, చేర్పులు చేయడం మనమే చేసుకోవాలి. ఇవన్నీ మనమే చేసుకోవడం అంటే చిన్న పత్రికలు నిర్వహించుకునే మనలాంటి వాళ్లకు సాధ్యమేనంటారా? ఆలోచించండి.. అలాగని ఆధునిక సౌకర్యాన్ని కాదనుకుంటామా? అందుకోలేమని వదులుకుంటామా?

'ఇఎంఎస్‌' చందాదారుగా మీకా అవసరం రాదు... రాకూడదనే మా ఈ ప్రయత్నం. ఖచ్చితంగా అన్ని పెద్ద పత్రికలకు సమానంగా మీ పత్రిక కూడా ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్‌ ఎడిషన్‌ నిర్వహిస్తుంది. అది కూడా పూర్తి ఉచితంగా... ఇది వరకే చెప్పుకొన్నట్టు చందాదారులకు మాత్రమే ఈ సేవలు ఉచితం. ఇతరులు కూడా పొందడానికి వినియోగ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధునిక సమాచార వ్యవస్ధను సొంతం చేసుకున్న తొలి తెలుగు వార్తా సంస్థగా 'ఇఎంఎస్‌' ఎలా గుర్తింపు పొంది... సేవలు అందిస్తోందో, ఇప్పుడు వెబ్‌ ఆధారిత సేవలను కూడా అంతే సమర్ధమంతంగా నిర్వహించడానికి మీ అందరి సంపూర్ణ సహకారం అవసరం. మీకందరికీ తెలుసు... 'ఇఎంఎస్‌' అందించే వార్తల్లో విశ్వసనీయత గురించి... రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌ కలిగిన సంస్థగా 'ఇఎంఎస్‌'కు గుర్తింపు ఉంది. యు.ఎన్‌.ఐ., పి.టి.ఐ. లాంటి సంస్థలకు కూడా జిల్లా స్థాయిలో లేని నెట్‌వర్క్‌ కలిగిన ఏకైక వార్తా సంస్థ 'ఇఎంఎస్‌' అని చెప్పడానికి గర్విస్తున్నాం.

మనం ఎంత మంచి వార్తను ప్రచురించామని కాదు... ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది... ఎలా వచ్చింది... దానిని సరఫరా చేసే సంస్థ విశ్వసనీయత ఏమిటి? ఒకవేళ ఆ వార్తను సరఫరా చేసిన సంస్థ వేరే అక్రమ మార్గంలో దానిని సేకరించి మీకు సరఫరా చేసి ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అలాంటి వార్తలను ప్రమోట్‌ చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏమిటి? అన్నది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏదో స్వయం ఉపాధి కోసం ఒకరిద్దరు కలిసి నిర్వహిస్తున్న సంస్థ 'ఇఎంఎస్‌' కాదని నిశితంగా మా వార్తలను పరిశీలిస్తున్న ప్రచురణకర్తలకు తెలిసిందే. ఆ నమ్మకమే నేడు ఇలా సరికొత్త సేవలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వచ్చేలా చేస్తోంది.

'ఇఎంఎస్‌' గురించి...
గత తొమ్మిదేళ్ల నుంచి తెలుగు పత్రికా ప్రపంచంలో సంచలనం రేపుతున్న 'ఎపిఇఎంఎస్‌' ఆంధ్రప్రదేశ్‌ మంతటా తన నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకుని సరికొత్త హంగులతో మీ ముందుకు వచ్చింది. రాజకీయాల దగ్గర నుంచి విశ్లేషణల వరకు... స్థానికం నుంచి అంతర్జాతీయం వరకూ అన్ని రకాల వార్తలు... కలర్‌ఫుల్‌ న్యూస్‌ ఫొటోలు, స్పెషల్‌ ఫొటోలు... ఒకటేమిటి... మీ విస్తరిలో షడ్రసోపేతమైన వార్తా భోజనం వడ్డించడం మా వంతు... ఆస్వాదించి, ఆరగించడమే మీవంతు.

ఇవన్నీ ప్రతీ వార్తా సంస్థ ఇచ్చేవే...! మరి ఇఎంఎస్‌ ప్రత్యేకత ఏమిటనే కదా మీ ప్రశ్న...
మీకు తెలుగులోనే వార్తలు వస్తాయి. మేమిచ్చే వార్తలకు టెలిప్రింటర్‌ అవసరం లేదు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసుకోవలసిన ప్రయాస ఉండదు. అనుభవజ్ఞులైన మా సంపాదక విభాగం అందిస్తున్న ఈ వార్తల్లో శీర్షికలు, వాక్య నిర్మాణం, శైలి మరే పెద్ద పత్రికలకు తీసిపోనట్టుగానే ఉంటాయి. ఎంతో వ్యయంతో రూపొందించిన ఇఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీని సహాయంతో మీ కంప్యూటర్‌లో ప్రతి వార్తని చదువుకోవచ్చు. ఎండిట్‌ చేసుకోవచ్చు. ఆ వార్తలను ప్రింటవుట్‌ కూడా తీసుకోనక్కర్లేకుండా యథాతథంగా పేజీలోకి తీసుకువెళ్లవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మా సాఫ్ట్‌వేర్‌ ఉన్న మీ కంప్యూటర్‌ మీకు 'జనరల్‌ డెస్క్‌'వంటిదన్న మాట. అత్యాధునిక డిజిటల్‌ కెమెరాలతో మేము తీసి పంపే ఫొటోలు మీ పత్రికకు కొత్త అందాన్ని ఇస్తాయి. తాజా న్యూస్‌ ఫొటోలతో పాటు స్పెషల్‌ ఫొటోలు, సినిమా స్టిల్స్‌ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. కనీసం 90 శాతం ఫొటోలు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవే ఉంటాయి కనుక మా ఫొటో సర్వీస్‌ అన్ని వేళలా స్థానిక పరిమళంతో గుబాళిస్తూ ఉంటుంది. మీ పత్రిక డెడ్‌లైన్‌కు అనుగుణంగానే సకాలంలో మీకు కావలసిన వార్తలు మా నుంచి అందుతాయి. మీకు కావలసిందల్లా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కలిగిన కంప్యూటర్‌, అంతే. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మేము పంపే వార్తలు, ఫొటోలు మీ ముంగిట్లో వాలుతుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు, మీకయ్యే ఆదా మరోఎత్తు. పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి ఇంత వరకు మీరు చేస్తున్న వ్యయం నుంచి మాకు చెల్లించే చందా (ఇది కచ్చితంగా మీ వ్యయం కన్నా తక్కువే ఉంటుంది.) తీసేస్తే ఇక మిగిలిందంతా మీకు ఆదాయే కదా. మీరు చందాదారులుగా చేరగానే మా ప్రతినిధి సాఫ్ట్‌వేర్‌ సరంజామాతో మీ దగ్గరకి వచ్చి, మీ కంప్యూటర్‌లో లోడ్‌చేసి, వాటిని ఉపయోగించే విధానం గురించి వివరంగా తెలియజేస్తారు. అంతేకాదు. స్వయంగా డిమాన్‌స్ట్రేట్‌ చేసి చూపించి, కావాలంటే మీ ఆపరేటర్‌ సహాయంతో డమ్మీ పేపర్‌ ప్రింటవుట్లు తీసి మీకిస్తారు. ఇందుకు మీరు పైసా కూడా చెల్లించక్కర్లేదు. అంతా ఉచితమే.
మరెందుకాలస్యం? మరిన్ని వివరాలకు సంప్రదించండి.
ఇఎంఎస్‌ మీ చెంత వుంటే పత్రిక నిర్వహణ నల్లేరుపై బండినడకే!
A.P. EXPRESS MEDIA SERVICE
The first satellite based news provider in India
Flat No: 19/20, Maturu Apts., A.C.Guards, Hyderabad-500 004.
e-mail: editor@apemsnews.com
website: www.apemsnews.com
www.telugu.apemsnews.com

పూర్తి వివరాలకు, వెబ్‌ సెట్‌ సేవల డెమో పేజీలకూ 9985544679 నంబర్లో సంప్రదించండి)
‘ఇఎంఎస్’ అక్రమ వినియోగదారులకు నోటీసులు
‘ఇఎంఎస్’ శ్రమను గుర్తించి ఆదరిస్తున్న వారందరికీ మరోమారు కృతజ్ఞతలు. చిన్న, మధ్యతరహా ప్ర్రచురణకర్తల ఆర్ధిక పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించేలా ‘ఇఎంఎస్’ చేస్తున్న కృషికి ప్రధాన అడ్డంకిగా మారిన అక్రమ వినియోగదారులను నియంత్రించేందుకు సంస్థ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలను స్వాగతించిన విజ్ఞులైన ప్రచురణకర్తలకు ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు... ‘ఇఎంఎస్’ ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా మీ అందరికీ తెలియజేస్తుందని... ఈ క్రమంలోనే ‘ఇఎంఎస్’ దుర్వినియోగదారులపై చర్యలు తీసుకునే విషయాన్నీ మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అక్రమ వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలను భేఖాతరు చేసి ఇతరుల యూజర్ ఐడి ద్వారా ‘ఇఎంఎస్’ సేవలు అనధికారికంగా వినియోగించిన వారిని గుర్తించడం జరిగింది. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని మీ అందరి ద్వారా వారిని మరోసారి బహిరంగంగా హెచ్చరిస్తున్నాం. వ్యాపార దృక్పథంతో కాకుండా చిన్న పత్రికల మనుగడే లక్ష్యంగా కదులుతున్న ‘ఇఎంఎస్’ అడుగులకు ఈ అనధికార వాడకం ముళ్లబాటగా తయారయిందని మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాము చేస్తున్నది చట్టప్రకారం తీవ్రమైన నేరమని తెలియకే చాలా మంది ప్రచురణకర్తలు ఈ అక్రమ వినియోగాన్ని కొనసాగిస్తున్నట్లు భావించి స్వచ్ఛంద మార్పు కోసం ఎదురుచూసి ఇన్నాళ్లూ దీని గురించి పెద్దగా పట్టించుకోని విషయమూ మీకు తెలియందేమీ కాదు. కానీ, కొంత మంది అక్రమార్కులు అదే పనిగా తమ అనధికార వినియోగాన్ని విస్తరించి దీన్నో వ్యాపారంగా మార్చేసిన నేపథ్యంలో సంస్థ పరంగా స్పందించక తప్పడంలేదు. తాజా నిర్ణయం ప్రకారం ‘ఇఎంఎస్’ సేవలు కేవలం చందాదారులకు మాత్రమే పరిమితం. చందాదారులు మినహాయించి సంస్థ నుంచి అనుమతి లేకుండా ఇతరులెవరూ కూడా ‘ఇఎంఎస్’ సేవలు వినియోగించడాన్ని చట్ట పరిధిలో నిషేధించి, ‘ఇఎంఎస్’ వెబ్ సైట్లో ప్రత్యేక ‘నిఘా’ ఏర్పాట్లు చేయడం జరిగింది. వైబ్ సైట్లో నమోదయ్యే వాడకందారుల కంప్యూటర్ ఐ.పి. అడ్రసు (నంబర్) ఆధారంగా అనధికార వినియోగదారులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏ చందాదారుని యూజర్ ఐ.డి. నుంచి అక్రమ వినియోగం జరిగిందన్న విషయం కూడా ఐ.పి. అడ్రస్ ఫైండర్ ద్వారా స్పష్టమవుతుంది. అలా అక్రమ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలిన వారిపై కూడా సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు. దయచేసి చందాదారులు ఎవరూ కూడా తమ యూజర్ ఐడిని ఇతరులకు ఇవ్వవద్దని మనవి. చందాదారులు కాని వారికి అలా యూజర్ ఐడి ఇవ్వడం కూడా సైబర్ చట్టం ప్రకారం నేరమే అవుతుంది కాబట్టి అలా చేయవద్దని సూచిస్తున్నాం. ఆ విధంగా మూడు సార్లు తమ యూజర్ ఐడి ద్వారా ఇతరులు లాగిన్ అయినట్లు నమోదైతే సంబంధిత అకౌంట్ దానంతట అదే డీ యాక్టివేట్ అవుతుందని గమనించాలి. నెలనెలా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న సంస్థ మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన అక్రమ వినియోగ భూతంపై ప్రకటించిన ‘ఈ సమరానికి’ విజ్ఞులైన మీ అందరి సహకారం ఎంతో అవసరం. సంపూర్ణంగా చేయూతనందిస్తారని ఆశిస్తూ... ఉచిత సేవలు ఇక ఎవరికీ ఇవ్వడం లేదుకాబట్టి వినియోగదారులందరూ రాష్ట్ర చిన్న, మధ్యతరహా దినపత్రికల సంఘం సూచనను అనుసరించి చందాదారులుగా చేరుతారని ఆశిస్తున్నాం.

ఎడిటర్, యాజమాన్యం తరపున

ఇక మరింత సులభంగా ‘ఇఎంఎస్’ సేవలు!
‘ఇఎంఎస్’ ఆశయం, లక్ష్యం మీకు తెలియందేమీ కాదు. రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా ప్రచురణకర్తలు, వెబ్ సైట్ నిర్వాహకులకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ, మెరుగుపరుస్తూ వస్తున్న క్రమంలోనే తాజాగా ఆదివారం (ఏప్రిల్ 5) నుంచి మరో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ‘ఇఎంఎస్’ వెబ్‌సైట్‌లోని న్యూస్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ పేజీలో స్వల్ప మార్పులు చేసి వార్తలను, ఫొటోలను విభాగాల వారీగా వర్గీకరించడం జరిగింది. ఫలితంగా వినియోగదారులు ఇకముందు జిల్లా వార్తల అన్వేషణ గురించి పెద్దగా శ్రమపడాల్సిన పనివుండదు. జిల్లాల వార్తలను ఆయా జిల్లాల విభాగంలో అప్‌లోడ్ చేయడం వల్ల వినియోగదారులు తమకు ప్రాధాన్యత గల ప్రాంతాల వార్తల గురించి ప్రత్యేకించి వెతుక్కొనే పని తప్పినట్టయింది. అదే విధంగా జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, సినిమా, వాణిజ్య తదితర విభాగాల వార్తలను కూడా సులభంగా గుర్తించడానికి వీలుగా వర్గీకరించడం జరిగింది. ఇన్నాళ్లూ ఏ వార్త ఎక్కడుంది? ఫలానా జిల్లా వార్త ఏ ఫైల్లో ఉంది? అని వెతుక్కునే వినియోగదారులకు శ్రమ తగ్గిస్తూ చేసిన ఈ మార్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇక ‘ఇఎంఎస్’ వార్తల్లో నాణ్యత, నవ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గతం కంటే సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయంటూ ప్రచురణకర్తల నుంచి వస్తున్న అభినందనలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని సరికొత్త సేవలు ప్రవేశపెట్టడానికి ‘ఇఎంఎస్’ కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తూ... సరికొత్త విధానంలో వార్తలు పొందడానికి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 9985544679 నెంబర్లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నాము.
పత్రిక నిర్వహణ మరింత సులభం!
పత్రిక నిర్వహణను మరింత సులభరతం చేస్తూ ప్రచురుణకర్తలకు ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ ‘ఇఎంఎస్’ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అందిస్తున్న వార్తలు, ఫొటో సర్వీసులను మరింత మెరుగుపర్చడంతో పాటు విలువ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొత్త సేవల్లో భాగంగా చందాదారులు (విలువ ఆధారిత సేవల సభ్యులు మాత్రమే) ‘ఇఎంఎస్’ నుంచి నేరుగా ప్రచురణకు సిద్ధంగా ఉన్న (రెడీ టు ప్రింట్) రెడీమేడ్ పేజీలను క్వార్క్ ఎక్స్ ప్రెస్ లేదా పేజ్ మేకర్ ఫార్మెట్లలో పొందవచ్చు. ముందుగా మీరు నిర్ణయించుకున్న సమయానికి ఆయా పేజీలను ‘ఇఎంఎస్’ వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పత్రిక నడపడం ఇంత సులభమా? అని అనుకునేలా అందుబాటులోకి తెచ్చిన మరికొన్ని సేవల్లో ఉత్తమ నాణ్యత (హై రిజల్యూషన్) కలిగిన ఫొటోల సరఫరా, కోరిన ప్రత్యేక వార్త, వ్యాసం, ఇంటర్వ్యూ లేదా మరేదైనా సమాచారాన్ని, ఫొటోలను నిర్ణీత గడువులోపు అందజేయడం, చందాదారుల పత్రికలను జిల్లాల వారీగా ‘ఇఎంఎస్’ మీడియా సెంటర్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రకటనకర్తలకు, సమాచార కేంద్రాలకు, పౌర గ్రంధాలయాలకు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని ఉచిత సేవల వివరాల కోసం ప్రచురణకర్తలు విలువ ఆధారిత సేవల విభాగాన్ని సంప్రదించండి... లేదా 9985544679 నెంబర్లో అదనపు సమాచారం కోసం అడగండి. - జనరల్ మేనేజర్, ‘ఎపిఇఎంఎస్’.


 


Members Login


Member   |   Subscriber

 User Name

 Password
 

Not a member? Register Here  |  Tariff



ముఖ్య సమాచారం

All Copyrights reserved | Powered by ARC Technologies